Archive for July, 2019

భాగవత కథలు

July 22, 2019

కం!!
పిలచిన పలికెడు వాని క
థలు వినినంతనె మనమున ధైర్యము కలుగున్
పలు కష్టంబులు కలిగెడి
కలికాలంబున, సులభముగ భవహరమగున్

షష్ట్యంతాలు

July 1, 2019

షష్ట్యంతాలు

హారికి, నందగోకులవిహారికిఁ జక్రసమీరదైత్య సం
హారికి, భక్తదుఃఖపరిహారికి, గోపనితంబినీ మనో
హారికి, దుష్టసంపదపహారికి, ఘోషకుటీపయోఘృతా
హారికి, బాలకగ్రహమహాసురదుర్వనితాప్రహారికిన్.

శీలికి, నీతిశాలికి, వశీకృతశూలికి, బాణ హస్త ని
ర్మూలికి, ఘోర నీరదవిముక్త శిలాహతగోపగోపికా
పాలికి, వర్ణధర్మపరిపాలికి నర్జునభూజయుగ్మ సం
చాలికి, మాలికిన్, విపుల క్ర నిరుద్ధ మరీచి మాలికిన్.

క్షంతకుఁ గాళియోరగవిశాలఫణావళినర్తనక్రియా
రంతకు నుల్లసన్మగధరాజ చతుర్విధ ఘోర వాహినీ
హంతకు నింద్ర నందన నియంతకు, సర్వచరాచరావళీ
మంతకు, నిర్జితేంద్రియసమంచితభక్తజనానుగంతకున్.

న్యాయికి, భూసురేంద్రమృతనందనదాయికి, రుక్మిణీమన
స్థ్సాయికి, భూతసమ్మదవిధాయికి, సాధుజనానురాగ సం
ధాయికిఁ బీతవస్త్రపరిధాయికిఁ బద్మభవాండభాండ ని
ర్మాయికి, గోపికానివహ మందిరయాయికి, శేషశాయికిన్.

షష్ట్యంతాలు అంటే కావ్యాన్ని అంకితం ఇచ్చే సందర్భంలొ వ్రాసిన పద్యాలుఇక్కడ పోతన కావ్యాన్ని రాముని ఆజ్జతో రాసి

శ్రీహరికి అంకితం ఇచ్చాడుఆపద్యాలన్ని ఒక శిల్పి శిల్పాల్ని చెక్కినట్టు చెక్కాడు పోతన్న.

మొదటగా నాలుపద్యాల్ని ధర్మానికుండె నాలుగు పాదాలైన సత్యముశీలముదయన్యాయము గా విభజించేడు.

అవి ఒక్కొక్కటి ఒక్కొపద్యానికి వర్తింపజేస్తూ ధర్మాన్ని నాలుగుపాదాల నడిపించమని  శ్రీహరిని వేడుకున్నాడు.

అంత్యప్రాసలతొ అత్యంత సుందరంగా వర్ణించేడుమనకి ఒక సందేహం రావచ్చుమొదటి పద్యంలొ సత్యం గురించి

చెప్పలేదుకదానాలాంటి మందబుద్ధులు ఉంటారిని పోతనకి బాగాతెలుసుఅందుకోసమే ముందుగానే చెతు లారంగ

అనే పద్యాన్ని రాసేడు.

అందులో  క్రమాలంకారాన్ని అన్వయంచెస్తే దయను శివుని గాను సత్యాన్ని హరి గాను తెలుసుకొవచ్చు.

 నాలుగు పద్యాల్లోనె కృష్ణ లీలన్ని వర్ణించేడుగొకులం నుంచి కృష్ణావతార సమాప్తి వరకు చెప్తూ కృష్ణ మూలము

అన్న పదాన్ని సార్ధకం చేసేడు.

మొదటి పద్యం లొ హారి అన్న పదం ప్రతి పాదానికి రెండు సార్లు వస్తుందిహరికిలక్ష్మీదెవికి స్వాగతం చెపుతూ అడుగడుగునా

(పాదం అంటె అడుగేకదాఅక్షర మాలలతొ స్వాగతం పలికేడుదాంతో పాటుగా  పద్యం చదువుతుంటె ఆశభ్దం లొ కొన్ని

మనకి స్పురిస్తాయినందగొకులము అనేటప్పుడు నందకం అన్నదిచక్రదైత్య అనేటప్పుడుచక్రముగొపనితంబినీ

అన్నప్పుడు గదఘోష కుటీప అన్నప్పుడు శంఖంసంపద అన్నప్పుడు లక్ష్మీ దెవి,  ఇలా అర్ధంలొ కాకుండా శభ్ద చిత్రణ

ద్వారా విష్ణుమూర్తిని సాలంకృతం గా మనముందు ఆవిష్కరిస్తాడు,.

పోతన తెలుగు వాడవటం మనందరి అదృష్టంపలికిన భవహరమగునట అనే తనేచెప్పేడుభాగవతం చదువుదాం

చదివిద్దాం.

కాముధ – కాకర మురళీధర్.