ఉప్మా

ఉప్మా విశ్వరూపం
నైమి శారణ్యంలొ సనకాది మహా మునులు తపస్సు చేసుకొంటూ ఉండగా నారద మహర్షి విచ్చేసారు. అర్ఘ్య పాద్యాదుల అనంతరం సావకాసంగా కూర్చొని అక్కడ ఉన్న మహర్షులు వారి కుటుంబాలతొ ముచ్చటించారు.  ముని పత్నులు వారి కష్టసుఖాలు వెళ్ల బొసుకుంటూ, భొజన సమయం లొ అప్పటికప్పుడు వచ్చే అతిథులకు షడ్ర షొపతమైన భొజనం సమకూర్చడం కష్టం అవుతొంది అని చెప్పారు. 

అప్పుడు నారద మహాముని వారు నేను ఈవిషయమై ఇదివరకు విష్ణుమూర్తి వారితొ ముచ్చటించాను. ఆయన దానికి ఒక బ్రహ్మండమైన ఒక ఉపాయం చెప్పారు.  వరినూక లేక గోధుమనూకైనా  సరే ఉప్పు తొ కలిపి నేయితొ వండి వడ్డిస్తే షడ్రసొపైతమైన భొజనముతొ సమానం అవుతుందని.  నెయ్యతొ కలిపి చెయడవలన దీనితొ  మహానైవేద్యం కుూడా చెయవచ్చని తెలిపారు. దానికి ఆవాలు, జీల కర్ర మొదలగు  సుగంధ ద్రవ్యాలతొ రంగరిస్తే అమృతతుల్యమవుతుందిని, అందువలన  దీనికి   ఉపమామృతము ( అమృతముతొ పోలిక గలిగినది) అనే పేరు వచ్చిందని తెలిపారు. 

త్రేతాయుగం లొ  అరణ్యవాసం లొ సీతాదేవి తరుచు దీనిని వండేవారని,  ద్వాపర యుగంలో  పాండవులు అరణ్యవాసంలొ ఉన్నప్పుడు అక్షయపాత్ర కడిగేసిన తరువాత వచ్చిన దూర్వసమహామునికి వారి శిష్య గణానికి ద్రౌపది ఈ వంటకాన్నే చేసి మహర్షి అభిమానాన్ని పొందారని చెప్పారు. ప్రస్తుత కలియుగం లొ రుూపాంతరం చెంది దీనికి ఉప్మా అనే పేరుతొ సర్వ జనమోదం పొందిందని సెలవిచ్చారు. 



ఉప్మా తత్వాలు

కొంతమందికి ఉప్మా ఇష్టం ఉండదు దానికి కారణం వారి ప్రారబ్ధ కర్మే,  భూలొకం లొ స్వర్గం చూసే రాత వారికి లేదు అంతే, దీంట్లో ఉప్మా తప్పేం లేదు. బుద్దిః కర్మాను సారిణి అని కదా అర్యోక్తి.  మన కర్మ ఫలానుసారం మనకి ఉప్మా ప్రాప్తిస్తుంది. ఉపకారం అంటే ఆమడదూరం ఉండేవాళ్ళకి ఉప్పులేని ఉప్మా తినాల్సి వస్తుంది. ఇతరలుని వెక్కిరించే వేళాకొళం వెసేవారికి ఉడికీ ఉడకని ఉప్మా తినాల్సి వస్తుంది. అందరిపై అకారణంగా అరుస్తూ చిర్రుబుర్రులాడుతూ ఉండేవారికి కారం ఎక్కువైన ఉప్మా తినాల్సి వస్తుంది. అందరితొ మంచిగా ఉండేవారికి జీడిపప్పు ఎక్కువగా ఉన్న రుచి కరమైన ఉప్మా దొరుకుతుంది. ఎంత చేసుకున్న వారికి అంత మంచి ఉప్మా….

ఉప్మా లొ పలు రకాలు..

మాములుగా చేసే గొధుమ నూక ఉప్మా యేకాకుండా, పెసరప్పు జీలకర్ర ఇంగువ వేసి చేసే వరినూక ఉప్మా, జీలకర్ర ఆవాలుపోపు పెట్టి చేసే బ్రెడ్ ఉప్మా, సేమ్యా ఉప్మా, రకరకాలు కురలు వెసి చెసే వెజటబుల్ ఉప్మా, అటుకుల ఉప్మా, ఇంకా పలు రకాలు. తినేవారికి జిహ్వచాపల్యం తీరేలా బొలెడు రకాలు. 

ఊప్మా రూపాంతరాలు

పూర్వం గోలుకొండ  ఇంకా కడుతూ ఉన్న రొజుల్లొ  ఒకసారి అక్కడ  కూలిపని చేస్తున్నవారిలొ ఒకావిడ  వరినూకలేక బియ్యం తొ కూరగాయలు కలిపి ఉప్మా వండుతున్నాది. ఆ సువాసన  అటుగా వెళుతూన్న నిజాంని ఆకర్షించింది. ఆయన వెంటనే తన వంట వాళ్లని ఆక్కడికి పంపించి ఏవండుతున్నారో  కనుక్కురమ్మని చెప్పారు. వారు కనుక్కొని దానికి మరికొంచం మసాలాలు కలిపి వండి బిర్యాని ( బిర్ యాని – వేగంగా వండే అన్నం)  అనిపేరు పెట్టారు. తరువాత కాలంలొ అని పులావు, ఫ్రైడ్‌రైస్ అంటు పలు విధాలుగా మారి మాంసంతొ కలిసి వేల వేల రూపాలు సంతరించుకుంది. ఈవిషయం మనకితెలిసిందే. దీని మూలాధారం ఉప్మాయే అని విన్నవించుకుంటున్నాను. 

ఉపసంహారం

పోపులో జీడిపప్పు, మినపప్పు, శనగపప్పు ఒకే రంగులోకి (రాగి రంగు) మారగానే స్టౌ కట్టేసి, తరిగుంచుకున్న పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేయాలి. ఇవి వేగడానికి పొపులో ఉన్న వేడి చాలు. తరువాత సిధ్ధంగా ఉంచుకున్న టమాటా ముక్కలు, ఉల్లిచెక్కు, వీలుంటే పచ్చి శనగలు (మట్టర్), కొన్ని చిన్నతరిగిన కేరేట్ ముక్కలు వేసుకొని తగినంత నీరు ఉప్పు వేయాలి. నీరు తెర్లుతున్నప్పుడు గొధుమనూక వేసి ఉడకగానె వెడిగా తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటాం. అనుపానులుగా అవకాయ, మినపసున్ని బహు శ్రేష్టమైనవి. ఒక కప్పులో గట్టి పెరుగు ఉంటే సంపూర్ణ అహారమే. 

ఉప్మా తినండి ఇమ్యూనిటీ పెంచుకోండి. 

– కాముధ – కాకర మురళీధర్.







One Response to “ఉప్మా”

  1. Kaushik Vadali Says:

    Super food

Leave a comment