కలడంతటన్

కలఁ డంభోధిఁ, గలండు గాలిఁ, గలఁ డాకాశంబునం, గుంభినిం
గలఁ, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం
గలఁ, డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగవ్యక్తులం దంతటం
గలఁ, డీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల యీ యా యెడన్.

పై పద్యం భాగవతం ప్రహ్లద చరిత్రలో ప్రహ్లద హిరణ్యకశప సంవాదంలొ వస్తుంది. విష్ణువు ఎక్కడున్నాడు అని అడిగినప్పుడు, పైపద్యం ప్రహ్లదుడు చెపుతాడు.

పంచభూతాలలోను, అన్ని దిశలోను, రేయింబవళ్లలోను, సూర్యచంద్రులలోను ఓంకారంలోనూ, త్రీమూర్తులలోను, స్త్రీపురుష,నపుసంకులలోనూ ఈశ్వరున్నాడు, అన్నీటిలోను లోను ఉన్నాడు, ఇక్కడా అక్కడా అని వేరే ఎందుకు వెతకటం అని అర్ధం.

చాలా మంచి పద్యం. ఇందులో ఒకటి, త్రిలింగవ్యక్తులంతటన్, అని పోతన ఎందుకన్నాడు, అన్నిటిలొనూ ఉన్న పోతన ప్రత్యేకం గా త్రిలింగ వ్యక్తులు అని ఎందుకు తిరిగి చెప్పాడు. త్రిలింగ వ్యక్తులు లంటే ఎవరు, అందరూ అనకుండా ఒక ప్రదేశాన్ని సూచించినట్లు అంతటా అని ఎందుకన్నాడు. త్రిలింగదేశంలొ ఉండే వ్యక్తులు కాదా, అంటే తెలుగు వారే కదా. ఎందుకలా అన్నాడు అంటే పోతన భాగవతాన్ని తెలుగులోనే వ్రాసాడు కాబట్టి.

పోతన తెలుగు భాగవతాన్ని తెలుగులో మంత్రాక్షారాలు నిఘూడంగా కూర్చి వ్రాసాడు. భాగవతాన్ని పలికితే భవహరమై, శ్రీకైవల్యాన్ని చేరటం తధ్యం. పోతన తెలుగు వాడవటం మన అందరి అదృష్టం.

కం!!
తెలుగున వ్రాసిన వేదము
లలిత మధురకథలు వీనులకు విందగుచున్
చిలికిన సుధారసంబై
పలికిన భవహరమగునట భాగవతంబున్

కాముధ – కాకరమురళీధర్

Leave a comment