వైశాఖం

May 9, 2013

వైశాఖం అంటే,
మల్లె పూలు – మావిడి పళ్ళు
ఎండలు – పెళ్ళిళ్ళు
సెలవులు – సరదాలు

కొత్త దంపతుల ప్రణయాలు
పరీక్షా ఫలితాల సందళ్లు
రిజర్వేషన్ దొరకని ప్రయాణాలు

ఇంకా

ఉక్కపోతలు – కొబ్బరినీళ్ళు
సరదాల సాయంత్రాలు – నిద్ర పట్టని రాత్రుళ్ళు

రేపటినించే వైశాఖం ప్రారంభం

Advertisements

తిక్క – లెక్క

May 11, 2012
మా వీధిలో ఓ కుక్కుంది
దాని కొంచం తిక్కుంది
దాంతో ఓ చిక్కుంది
ఎందుకంటే
దానికి లెక్కలు రావు

చదువు చెప్పిన ఉపాధ్యాయులకు

September 5, 2011

చెయ్యి పట్టు కొని అక్షరాలు దిద్దించి

చదువు తొ పాటు సంస్కారం కలిపి నేర్పించి

ఆటలు ఆడించి, పాటలు పాడించి

జీవితం లో వేసిన తొలి అడుగుల తప్పులు దిద్దించి

సన్మార్గం లొ నడిపించిన ప్రతీ ఉపాధ్యాయునికి పాద నమస్కారలతొ.

సంతొషం అంటే ఏంటి?

July 14, 2011

సంతొషం అంటే ఏంటి?,
అది ఒక అలొచనా, లేక ఒక అనుభవమా, లేక ఒక మానసిక స్థితా,

ఏంటది?

ఉగాది శుభాకాంక్షలు

April 3, 2011

ఉగాది

Please open the link

వేటూరి వారి రసాలు- 1

December 30, 2010

అక్షరాల తో ఆడుకోనే అట లో వేటూరి మనకు మిగిల్చిన అద్భుతం.

___________________________________

దొరల నీకు కనుల నీరు
దొరల దీ లొకం,  మగ దొరల దీ  లొకం

కనులలోనే దాచుకోవే కడలి లా శొకం
కన్నె పడుచు లా శొకం.

నాల్గు దిక్కుల నడుమ పుట్టి నలిగి పోయే జగతి లో 
నాల్గు దిక్కుల నడుమ పుట్టి నలిగి పోయే జగతి లో
నాలుగు పాదల ధర్మం నడవలేని ప్రగతిలో
నాలుగు స్తంబాల ఆట ఆడ బ్రతుకు తెలుసుకొ

దొరల నీకు కనుల నీరు
దొరల దీ లొకం మగ దొరల దీ  లొకం

కనులలోనే దాచుకోవే కడలి లా శొకం
కన్నె పడుచు లా శొకం.

వెన్నెలే కరువైన నాడు కంటి నిండా చుక్కలే                                           
వెన్నెలే కరువైన నాడు కంటి నిండా చుక్కలే
కన్నె గానే తల్లి వైతే కంటి నిండా చుక్కలే
నాల్గు ముగముల బ్రహ్మ రాసిన కర్మ నీకిది తెలుసుకొ

దొరలనీకు కనుల నీరు
దొరల దీ లొకం మగ దొరల దీ  లొకం

కనులలోనే దాచుకోవే కడలి లా శొకం
కన్నె పడుచు లా శొకం.

కలవని తీరాల నడుమ  గంగ లాగ కదిలి పో
కలవని తీరాల నడుమ  గంగ లాగ కదిలి పో
అమ్మగా ఒక జన్మనిచ్చి అవని నీవై మిగిలిపో
నాలుగు వేదాల సారం అనుభవం లో తెలుసుకో

దొరల నీకు కనుల నీరు
దొరల దీ లొకం మగ దొరల దీ  లొకం
కనులలోనే దాచుకోవే కడలి లా శొకం

మరచి పోయిన ఙ్ఞాపకం

June 30, 2010

అనుభవాల పేటిక లోంచి 
ఒక ఙ్ఞాపకం లేచివచ్చి అంది కదా!!

ఎలాంటి వాడివి నువ్వు,
నన్నే మరిచి పోయావు,

పచ్చని పచ్చిక పై నడచి వచ్చిన అనుభూతిని,
ఉదయాన్నే లేత పచ్చిక పై మంచు బిందులవులతొ కలసి మాట్లాడిన మాటలను
ఎగిరి పడే తూనీగలతో కలసి ఎగిరి పడె మనసును మరచి పోయావు

అవునులే, నవీన జీవన సమరం లో 
విజయ పోరాటానికి తప్ప అనుభూతులకు చోటు లేదు
ఈ ఇమైల్-ఇంటర్‌నెట్ కాలం లో అనుభవాలు నెమరువేసుకొనే టైమే లేదు.

కాని, ఒక నిదురాని రాత్రి 
మనసు పుస్తకాల దొంతరల లోంచి లేచి వచ్చి
ఙ్ఞాపకాలను చిలకరించి, వేగుతున్న మనసును లాలించి నిదురపుచ్చి
తెల్లవారేసరికి వేయి వసంతాల వెలుగునిచ్చింది.

                                                                -కాముధ

ఎయ్‌ రా జొకులైరా

June 16, 2010

ఆష్ట చెమ్మ ఆట

May 29, 2010

  

శశిరేఖా పరిణయం లో సిరివెన్నెల పాట

April 22, 2010

ఏదో ఒప్పుకోనంది నాప్రాణం
ఇది ఏదొ చెప్పనంటొంది నా మౌనం

ఉబికివస్తున్నా సంతొషం
అదిమి పెడుతొందే ఉక్రొషం
తన వెనుక నేను నా వెనుక తాను
ఎంత వరకీ గాలి పయనం
అడగదే ఉరికే ఈవేగం.

ఎదొ ఎదో ఏదో ఒప్పుకోనంది నాప్రాణం
ఇది ఏదొ చెప్పనంటొంది నా మౌనం

ముల్లులా బుగ్గను చిదిమిందా
మెల్లగా సిగ్గును కదిపిందా
వానలా మనసును తడిపిందా
వీణలా తనువును తడిమిందా

ముల్లులా బుగ్గను చిదిమిందా
మెల్లగా సిగ్గును కదిపిందా
వానలా మనసును తడిపిందా
వీణలా తనువును తడిమిందా

చిలిపి కబురు ఏం విందో…
వయసు కేమి తెలిసిందో…

అదమరుపో ఆటవిడుపో
కోద్దిగా నిలబడి చూసా


ఆ క్షణం కంటే కుదరంది నాప్రాణం
కాదంటే ఏదురు తిరిగింది నాహృదయం

————————————————————-

ఈపాట గురించి కొంచం చెపుదామని రాసేను, కాని చెప్పడానికి ఆయన నాకు ఏం మిగల్చలేదు.  

కాముధ.