Archive for the ‘తెలుగు టపాలు’ Category

భగవద్గీత – 1

July 2, 2016

భగవద్గీత అర్ధం కావలంటే అర్జున విషాదయోగం తో అనుసంధానం కావాలి. యుధ్ధప్రారంభానికి ముందు అర్జునుని మనఃస్తితి అర్ధంకాకపోతే భగవద్గీత కేవలం శుశ్కవాదం గాను, నిష్క్రియాపరత్వాన్ని భొదించేది గాను, వ్యక్తి పూజను ప్రొత్సహించేది గాను కనబడుతుంది.
అర్జునుని నిర్వేద సముధ్దతి తెలియకపోతే, కర్మ యోగం అసమంజసం గాను, ఙ్ఞానవిఙ్ఞాన యోగం స్వయంస్తుతి గాను, విభూతియోగం మతిస్తిమితంలేని ప్రేలాపనగాను అనిపిస్తుంది.
అర్జునిని విషాదం చాలా మందికి ఎందుకి అర్ధం కాదు, కారణం చాలా చిన్నది. సీతారామ శాస్త్రి గారు చెప్పినట్లు “మనం… ఈదుతున్నాం చెంచాడు భవ సాగరాలు”. మనం మన కస్టాలు చాలా చిన్నవి, వాటిని అర్జునవిషాదంతో ఐడింటిఫై చెయ్యలేం. జీతం పెరుగుదల, అదికారి వ్యాత్సల్యం, పదోన్నతి, అరోగ్యం, ఆస్తి వీటి క్షీణతే మనకు అనిశాపాతం. మన మాట నెగ్గకపోవటమే, మనకు అత్యంత ధుర్భరం. వీటినిమించి మనకు పెద్దగా కస్టాలు లేవు. వీటిని అధికమించడానికి మనకు భగవద్గీత లాంటి అధ్యాత్మికత, విశ్వరహస్యాలు మేళవించిన మనో వైఙ్ఞానిక గ్రంధం అవసరం లేదు. వ్యక్తిత్వవికాశ గ్రంధాలో మొట్టమొదటిది అత్యుత్తమమైనది అయిన భగవద్గీత అందుకే నవీన నిత్య జీవనంలో కేవలం వృద్ధుల పారయణ గ్రంధంగా మిగిలిపోయింది.
అర్జనుడు యుధ్ధం ఎందుకు వద్దన్నాడు. అతనికి యుధ్ధం అంటే ఏకోశాన భయం లేదు. అతను జయత్ర యాత్ర చేసి అనేక దేశ దేశాలను స్వయంగా జయించాడు. నేర్చుకున్న అస్త్ర శస్త్రాలను యుధ్ధ తంత్రాలను నియొగించి అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. అర్జుననుని మించిన వీరుడు అక్కడ కురుక్షేత్రం లో మరోకరు లేరు. అయినా ఎందుకు వద్దన్నాడు.
అర్జున విషాద యోగం గూర్చి తరువాతి టపాలో
కాముధ – కాకర మురళీధర్

Advertisements

నేను భగవద్గీత.

June 21, 2016

నేను 17 యేళ్ళ వయసు లొ మొదటి సారి భగవద్గీత చదివినప్పుడు అందులో వున్న వ్యాకరణ విశేషాలకి ముగ్ధుడనయ్యాను. ఆ శబ్ధాలంకారాలకి, వివిధమైన అర్ధాలంకారలకి వివశుడనయ్యాను. ఆ శ్లోకాల నడకకి పదాల పోహళింపుకి పరవశుడినయ్యాను. కృష్ణుడు అర్జనుడి సంభోదించడానికి వాడిన దరిదాపు 45 వివిధమైన పదాల వైవిధ్యానికి ఆశ్చర్య పోయాను.

30 యేళ్ళ వయసులో రెండవ సారి చదివినప్పుడు ఆత్మ సంయనయోగం తొ వైఫల్యాల విచారం నుండి విముక్తుడనై, కర్మ యోగం తొ కార్యోన్ముఖుడనయ్యను.

35 యెళ్ళ వయసులో మరో సారి చదివినప్పుడు అక్షర బ్రహ్మ యోగంలొ ఉన్న ఖగొళ శాస్త్ర విషయాలకి, సమయానికి స్తలానికి ఉన్న సంబంధం గురించిన వివరణ, వ్యక్తానికి అవ్యక్తానికి ఉన్న వివరణకి ఐనస్టీన్ థియరి ఆఫ్ కర్వేచర్ ఉన్న పోలికలను చూసి విస్తుపొయాను.

40 యేళ్ళ వయసులో మరో సారి సాంఖ్య యోగం చదివినప్పుడు వివరించిన నాయకత్వ లక్షణాలు వివరణ ఇన్నిసార్లు చదివినపుడు ఎలా నాకు స్పురించలేదో ఇప్పుడు మాత్రమే ఎందుకు అర్ధం అవుతునాదో అర్ధం కాలెదు.

42 యేళ్ళ వయసులో మరో సారి చదివినప్పుడు కర్మ సన్యాస యోగం అంటే కర్మ యోగానికి వ్యతిరేకం కాదని. It is the difference between doing the things and getting the things done అని అర్ధం అయ్యి నా ఉద్యొగ నిర్వాహణా దక్షతని మరో ఎత్తుకి తీసుకు వెళ్ళింది.

తరువాత మరో సారి చదువుతున్నపుడు రాజవిద్యా రాజగుహ్య యోగానికి, విభూతి యోగానికి ఉన్న స్వల్పమైన వ్యత్యాసం అర్ధమైనప్పుడు పరమానంద భరితుడినయ్యాను.

ఇలా చదువుతున్న ప్రతీసారి ఒక కొత్త కొణం కనిపించి సరికొత్త పుస్తకం మొదటి సారిగా చదువుతున్న అనుభూతిని ఇచ్చేది ఒక్క భగవద్గీత మాత్రమే.
కాముధ ఉరఫ్ కాకర మురళీధర్

బాహుబలి అఖండ విజయానికి కారణాలు.

July 30, 2015

ఈ మధ్య తెలుగు వెబ్ మీడియా లో బాహుబలి బాగులేదన్నవాడు మేధావి గాను, బాగుందన్నవాడు ఉత్తమాభి రుచి లేని వాడుగాను పరిగిణిస్తున్నారు. బాగులేదన్నవారు కూడా ఎందుకు బాగులేదంటే, ఇది గుణసుందరి సుగుణసుందరి కథలలా లేదు, మాయాబజార్ మంగమ్మశపధం లా లేదన్నవాడేతప్ప ఎందుకు బాగాలేదో సమగ్రంగా విశ్లేషించిన వారు లేరు.

ఈ సినిమా అఖండ విజయనికి కారణాలుగా, మార్కెటింగ్, కులాభిమానం, ఇంకా వేరే రాజకీయాల్ని సాకులుగా చూపిస్తున్నారు.

ఒకవిషయం మాత్రం మరిచిపోయెరు. సినిమా విజయానికారణం ప్రేక్షకుల ఆదరణ. ఈ సినిమాప్రేక్షకులకు ఎందుకు నచ్చిందో ఒక్కడు కూడా రాయలేదు. నచ్చిందన్న ప్రతివాడిని ఒక వెర్రి వెధవని చూసినట్లు చూస్తున్నారు.

బాహుబలి అఖండ విజయానికి కారణాలు.

1) తమకు తెలిసిన పరిచియమైన కథ దానికి తగ్గ విభిన్నమైన కథనం.

2) మొదట్లోనే అద్భుతమైన హీరో ఎలివేషన్.

3) సీన్‌కి సీన్‌కి లింకింగ్.

4) కంటిన్యుగా ఎమోషన్స్ కేరి అవ్వడం.

5) యుధ్ధం సంఘటన. అక్కడ కెమేరా ముందే మాత్రమే యుధ్ధం జరుగుతునట్లు ఎవరికి అనుమానం రాలేదు. ఒక క్రికెట్ మాచ్ లైవ్ టెలికాస్ట్ జరుగుంటే చూసినట్లు, అక్కడ ఒక యుధ్ధం లైవ్ టెలికాస్ట్ చేసినట్లు చూపించారు.

6) విగ్రహస్తాపన సమయంలో బాహుబలి జయజయ ధ్వానాలు.

ఇంకా మరెన్నో….

ఈ విమర్శకులందరికి తెలిసిన మరోక విషయం. Reason stops the moment Drama starts. రాజమౌళి Drama ఎక్కడమొదలు పెట్టెడో అక్కడ ఖచ్చితంగా ప్రేక్షకులు ఫీల్ అయ్యేరు. విమర్శకులు ఫీల్ అవలేదు. Sometimes Ignorance is Bliss.

నాకు తెలుసు

November 19, 2014

నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు.
పెరిగిన ఖర్ఛులకి పెరగని జీతానికి పొంతన కుదరనప్పుడు
ఎక్కడ ముడి వేయాలి, ఎక్కడ కత్తిరించాలి
అదాయ వ్యయాలని ఎలా సమన్వయం చేయాలి
జీవన ప్రమాణాలు దిగజారకుండా ఎలా చెయ్యాలో
నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు.

పదాలకున్న అర్ధాలు అపార్ధాలైనప్పుడు
మానవ సంబంధాలు మృగ్యమైనప్పుడు
ఎవరిని ఎలా బుజ్జగించాలో, ఎవరిని లాలించాలో
జీవిత పధాన్ని ఎలా అనందమయం చెసుకోవాలో
నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు.

ఉద్యొగ నిర్వాహణ క్రమం లో తప్పులు చేసినప్పుడు.
పొంచి ఉన్న రాబందులు రెక్కలు విప్పి వీర విహంగం చేసినప్పుడు
ఎత్తుకి పై‌ఎత్తు ఎలా వెయాలో ఎవరిని ఎలా సమాధాన పరచాలో
జీవిత రధాన్ని సాఫీగా ఎలా ముందుకు సాగించాలొ
నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు.

నాకు తెలిసినది, నేను తెలుసుకున్నది, నాకు తెలియనిది
నాకు తెలుసుని నాకు తెలిసినది
నాకు తెలియదని నాకు తెలిసినది
ఇదంతా నిజంగా నాకు తెలియదని
శ్రీమహా విష్ణు సామ్రాజ్యంలో నా ప్రవర్తన కేవలం కల్పితమని
నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు.

వైశాఖం

May 9, 2013

వైశాఖం అంటే,
మల్లె పూలు – మావిడి పళ్ళు
ఎండలు – పెళ్ళిళ్ళు
సెలవులు – సరదాలు

కొత్త దంపతుల ప్రణయాలు
పరీక్షా ఫలితాల సందళ్లు
రిజర్వేషన్ దొరకని ప్రయాణాలు

ఇంకా

ఉక్కపోతలు – కొబ్బరినీళ్ళు
సరదాల సాయంత్రాలు – నిద్ర పట్టని రాత్రుళ్ళు

రేపటినించే వైశాఖం ప్రారంభం

తిక్క – లెక్క

May 11, 2012
మా వీధిలో ఓ కుక్కుంది
దాని కొంచం తిక్కుంది
దాంతో ఓ చిక్కుంది
ఎందుకంటే
దానికి లెక్కలు రావు

చదువు చెప్పిన ఉపాధ్యాయులకు

September 5, 2011

చెయ్యి పట్టు కొని అక్షరాలు దిద్దించి

చదువు తొ పాటు సంస్కారం కలిపి నేర్పించి

ఆటలు ఆడించి, పాటలు పాడించి

జీవితం లో వేసిన తొలి అడుగుల తప్పులు దిద్దించి

సన్మార్గం లొ నడిపించిన ప్రతీ ఉపాధ్యాయునికి పాద నమస్కారలతొ.

సంతొషం అంటే ఏంటి?

July 14, 2011

సంతొషం అంటే ఏంటి?,
అది ఒక అలొచనా, లేక ఒక అనుభవమా, లేక ఒక మానసిక స్థితా,

ఏంటది?

ఉగాది శుభాకాంక్షలు

April 3, 2011

ఉగాది

Please open the link

వేటూరి వారి రసాలు- 1

December 30, 2010

అక్షరాల తో ఆడుకోనే అట లో వేటూరి మనకు మిగిల్చిన అద్భుతం.

___________________________________

దొరల నీకు కనుల నీరు
దొరల దీ లొకం,  మగ దొరల దీ  లొకం

కనులలోనే దాచుకోవే కడలి లా శొకం
కన్నె పడుచు లా శొకం.

నాల్గు దిక్కుల నడుమ పుట్టి నలిగి పోయే జగతి లో 
నాల్గు దిక్కుల నడుమ పుట్టి నలిగి పోయే జగతి లో
నాలుగు పాదల ధర్మం నడవలేని ప్రగతిలో
నాలుగు స్తంబాల ఆట ఆడ బ్రతుకు తెలుసుకొ

దొరల నీకు కనుల నీరు
దొరల దీ లొకం మగ దొరల దీ  లొకం

కనులలోనే దాచుకోవే కడలి లా శొకం
కన్నె పడుచు లా శొకం.

వెన్నెలే కరువైన నాడు కంటి నిండా చుక్కలే                                           
వెన్నెలే కరువైన నాడు కంటి నిండా చుక్కలే
కన్నె గానే తల్లి వైతే కంటి నిండా చుక్కలే
నాల్గు ముగముల బ్రహ్మ రాసిన కర్మ నీకిది తెలుసుకొ

దొరలనీకు కనుల నీరు
దొరల దీ లొకం మగ దొరల దీ  లొకం

కనులలోనే దాచుకోవే కడలి లా శొకం
కన్నె పడుచు లా శొకం.

కలవని తీరాల నడుమ  గంగ లాగ కదిలి పో
కలవని తీరాల నడుమ  గంగ లాగ కదిలి పో
అమ్మగా ఒక జన్మనిచ్చి అవని నీవై మిగిలిపో
నాలుగు వేదాల సారం అనుభవం లో తెలుసుకో

దొరల నీకు కనుల నీరు
దొరల దీ లొకం మగ దొరల దీ  లొకం
కనులలోనే దాచుకోవే కడలి లా శొకం