శ్రీక్రిష్ణలీలలు

అల్లరి పిల్లడు చోరుడు
కల్లలు జెప్పును, యువతుల కలవర బెట్టున్
చెల్లని కాణికి తక్కువ
తెల్లగలేని యితడేమి దేవుడు జెప్పున్

– కాముధ  – కాకరమురళీధర్

అల్లరి చేస్తాడు, దొంగతనం చెస్తాడు, అపధ్దాలు చెప్తాడు, ఆడపిల్లలను అల్లరి పెడతాడు, ఏపని చెయ్యడు, చిల్లు కాణి విలువ చెయ్యడు, కనీసం తెల్లగా అందంగా ఉండడు ఇతడు దేవుడు అని ఎలా చెప్పను. ఇది భాహ్య అర్ధం.

అంతరార్ధం.

అల్లరి పిల్లడు – దామోదరుడు – కృష్ణుడు అల్లరి చెస్తే యశొద రొటికి కట్టేసి నపుడు రొటితొ సహా పాకి మద్ది చెట్లను కూల్చి యక్షుల శాప విమోచనం.
చోరుడు – వెన్నను దొంగిలించి స్నేహితులకు పంచి. త్వరగా పాడైపోయె పధార్ధాలను మనం దాచుకోవడం  తప్పు. నలుగురికి పంచాలి అని సూచన. త్వరగా పాడైపోయె పదార్ధలలో ధనం దేహం కూడా ఉన్నాయి.
కల్లలు జెప్పును:- మన్ను తినలేదని అపధ్ధం చెప్పి యశొదకి 14 భువన భాండాలు చూపించడం.
యువతుల కలవర బెట్టున్:- ఆడపిల్లలు బహిరంగంగా నగ్నంగా స్నానం చేయకుడదని చెప్పడం. ఈ చర్యలో అంతరార్ధం. ద్రౌపదీ మానసంరక్షణం చేసి, చీరలు దొంగిలించడమే కాదు చీరలు ఇచ్చేదికూడా నేనేనని చెప్పడం
చెల్లని కాణికి తక్కువ:- క్రిష్ణతులాభారం. ఎన్ని నగలు వేసినా తూగని వాడు. భక్తితొ వేసిన తులశీ దళానికే తేలి పోవడం. ఇంకా, ఏపని చెయ్యని వాడ్ని మనం చిల్లు కాణీకి కొరగాడు అని అంటాం.  భారత యుధ్ధం సమయంలొ నేను యుధ్ధం చెయ్యను కేవలం సలహా మాత్రమే ఇస్తాను అని చెప్పడం. సలహాలతోనె కౌరవులలో సగం సైన్యం ఉన్న పాండవులని గెలిపించడం.
తెల్లగలేని:- తెల్లగా ఉండేవాడు ఈశ్వరుడు. నల్లటి, మేఘవర్ణుడు విష్ణువు. స్వయంగా విష్ణుమూర్తి అవతారం.
ఏమి దేవుడు చెప్పున్:- ఇందులో మనం కష్టాలలొ ఉన్నప్పుడు దెవుడా నేనేం చెయాలో చెప్పు అన్నట్లు. భారత యుధ్ధసమయం లొ అర్జునుడు దిగులు పడటం విషాద యొగ సూచన, ఇంకా దేవుడు చెప్పున్ అంటే భగవద్గీత, అంటె అర్ధం భగవంతుడు చెప్పినది అని.(Voice of God).

పై పద్యంలొ వ్యాజస్తుతి అలంకారం తొ పాటు చివరన శ్లేషాలంకారం కూడా ఉంది.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s


%d bloggers like this: