అనుభవాల పేటిక లోంచి
ఒక ఙ్ఞాపకం లేచివచ్చి అంది కదా!!
ఎలాంటి వాడివి నువ్వు,
నన్నే మరిచి పోయావు,
పచ్చని పచ్చిక పై నడచి వచ్చిన అనుభూతిని,
ఉదయాన్నే లేత పచ్చిక పై మంచు బిందులవులతొ కలసి మాట్లాడిన మాటలను
ఎగిరి పడే తూనీగలతో కలసి ఎగిరి పడె మనసును మరచి పోయావు
అవునులే, నవీన జీవన సమరం లో
విజయ పోరాటానికి తప్ప అనుభూతులకు చోటు లేదు
ఈ ఇమైల్-ఇంటర్‌నెట్ కాలం లో అనుభవాలు నెమరువేసుకొనే టైమే లేదు.
కాని, ఒక నిదురాని రాత్రి
మనసు పుస్తకాల దొంతరల లోంచి లేచి వచ్చి
ఙ్ఞాపకాలను చిలకరించి, వేగుతున్న మనసును లాలించి నిదురపుచ్చి
తెల్లవారేసరికి వేయి వసంతాల వెలుగునిచ్చింది.
-కాముధ
Advertisement
June 30, 2010 at 3:03 pm |
bagumdi anDi.
November 26, 2011 at 4:19 am |
అవునులే, నవీన జీవన సమరం లో
విజయ పోరాటానికి తప్ప అనుభూతులకు చోటు లేదు
ఈ ఇమైల్-ఇంటర్‌నెట్ కాలం లో అనుభవాలు నెమరువేసుకొనే టైమే లేదు.లెస్స పలికితిరి! చాలా చక్కగా చెప్పారండీ!
November 26, 2011 at 5:57 pm |
నిదురలేని రాత్రి జ్ఞాపకాల అలలు కదిలే తరుణం. బాగా చెప్పారు..
February 12, 2012 at 7:24 am |
This has an inner meaning. When you are going great, never get stopped.
When you are get stucked, look back, you will have a solution from your failures or form your expereinces.
Kamudha